సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది. ఆమధ్య కాస్టింగ్ కౌచ్ పెద్ద కలకలం సృష్టించింది. తాజాగా డ్రగ్స్ వ్యవహారం అందర్నీ కలవరపెడుతోంది. రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాలీవుడ్లో మొదలైన ఈ కేసు శాండల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్‌ని కూడా తాకింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి పెద్ద హీరోయిన్ అనిపించుకుంటున్న రకుల్ ప్రీత్ ఈ కేసులో కీలక వ్యక్తి అని తెలిసిన తర్వాత ఎప్పుడు ఎవరి పేరు వినిపిస్తుందోనని టాలీవుడ్ ప్రముఖుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కన్నడ హీరోయిన్ రాగిణి, తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన సంజనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కటకటాల వెనుక ఉన్నారు. బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా మరికొన్ని రోజులు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్‌ను సేకరించి వారి దగ్గర ఉంచుకుంటున్నారన్న ఆరోపణపై వీరిద్దరినీ కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు తీవ్రతను బట్టి చూస్తే వీరికి బెయిల్ దొరికే అవకాశం, కేసు నుంచి బయటపడే ఛాన్స్ చాలా తక్కువ.
వీరిని విచారించిన పోలీసులకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. వీరి మొబైల్స్‌లో డిలిట్ చేసిన డేటాను రికవర్ చేస్తే కొన్ని ఫోటోలు, వీడియోలు లభించాయి. వేరే హీరోయిన్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు వీరిద్దరి ఫోన్లలో ఉన్నాయి. అంతే కాకుండా వీరికి సంబంధించిన కొన్ని సెక్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అనుకోకుండా బయట పడిన ఈ ఫోటోలు, వీడియోల వల్ల కేసు కొత్త మలుపు తిరగబోతోంది. వేరే హీరోయిన్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు వీరి దగ్గర ఎందుకు వున్నాయి, వాటితో ఏం చెయ్యాలని ప్లాన్ చేశారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్‌తో పాటు ఇవి కూడా పోలీసులకు చిక్కడంతో రాగిణి, సంజనల చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకా ఏయే విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.