ఒక్క టూర్‌తో.. అటు స్వామి కార్యం.. ఇటు స్వకార్యం చక్కబెట్టుకుంటున్నారు జనసేనాని. తిరుపతి ఎన్నిక, సోము వీర్రాజు వ్యాఖ్యలు వీటిన్నంటి గురించి బీజేపీ అధిష్టానంతో చర్చించడంతోపాటు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పునరాలోచించమని విన్నవింటుకంటూ.. అమిత్ షాకు వినతి పత్రం అందించారు పవన్ కళ్యాణ్.
కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారు కి జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు అందజేసిన వినతి పత్రం pic.twitter.com/BNPSIQJI3r
— JanaSena Party (@JanaSenaParty) February 9, 2021
నాదెండ్ల మనోహర్‌తో ఢిల్లీ పయనమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. అమిత్ షాను కలిసి రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి చర్చించడంతో పాటు.. తెలుగు ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎందరో త్యాగానికి గుర్తని.. అలాంటి దానిని ప్రైవేటు పరం చేయద్దని వినతి పత్రం అందించారు. పవన్ అందిన పత్రంలో ‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోమంది పోరాటానికి చిహ్నం. ఈ పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 64 గ్రామాలు కాలీ చేశారు. 22 వేల ఎకరాలు విశాఖ కోసం అందించారు. ప్రస్తుతం ఈ కంపెనీ 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. మరో లక్ష మంది ప్రజలు ఉక్కు కర్మాగారం మీద పరోక్షంగా ఆధారపడ్డారు. రూ .3 వేల కోట్లకు నికర నష్టాలు వాటిల్లినట్లు నిఖర అంచనా వేసారు. దీనికి ప్రధాన కారణం ముడి సరకు లేకపోవడం. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులను ప్రైవేటీకరించే బదులు గనులను కేటాయించి.. రుణభారాన్ని తగ్గించాలని కోరుతున్నాను’. ప్రజల మనోభావాలను తెలియజేయడంతో పాటు.. కర్మాగారాన్ని కాపాడుకునే సూచనలు కూడా చేశారు పవన్ కళ్యాణ్.











