ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్పీకర్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో వారికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. వెంటనే స్పీకర్ దంపతులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే స్పీకర్ దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దని వారు సూచించారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం విజ్ఙప్తి చేశారు.
కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...











