కొత్త జిల్లాలపై సాగుతున్న ఆందోళనలు..
జగన్ రెడ్డి ప్రభుత్వం ఉగాదికి కొత్తజిల్లాల ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది! పార్లమెంట్ వారీగా జిల్లా కేంద్రాలను ఏర్పాట చేస్తానన్న జగన్ హామీ.. కొన్ని ప్రాంతాలలో రాజకీయ అవసరతలు కోసం ఇష్టరాజ్యంగా విభజన ప్రక్రియను అనుసరించడం దారుణమని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మొత్తం ఏపీలో 26 జిల్లాలు, 15 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయక్తమవుతున్న వేళ.. అన్ని జిల్లాల నుంచి నిరసనలైతే వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కుప్పం కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ కు చెందిన ఆరుగురు సెల్ టవర్ ఎక్కి.. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 26న సీఎం తిరుపతి వస్తున్నారని, అక్కడ కలిసి వినతి పత్రం ఇద్దామని ఎమ్మెల్సీ భరత్ ఫోన్ చేసి నచ్చచెప్పడంతో వారు టవర్ దిగి కిందకు వచ్చారు.
రాయసీమలోని ఆ మూడు జిల్లాలో నిరసన సెగలు..
జిల్లా పునర్విభజన అంశం రాయసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో అగ్గి రాజేసింది! కడప జిల్లాలో ఏర్పాటు కానున్న అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని ఇక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. బంద్ కు పిలుపునిచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలో సొంత పార్టీ నేతలే ఈవిషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రోడ్డెక్కాడం విశేషం! రాయచోటి వద్దు – రాజంపేట ముద్దు అంటూ స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజంపేట కేంద్రంగానే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.. అలా కాకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వైసీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించడం గమనార్హం! మరో వైపు అనంతపురంలో శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే! ఈ ప్రాంతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిన నాటకానికి సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. హిందూపురంలో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయకుంటే అమరణ నిరాహార దీక్షకైన వెనకాడమని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. ఇక చిత్తూరు జిల్లాలో మదనపల్లె జిల్లా కోసం జేఏసీ నేతలు సంతకాల సేకరణ ప్రారంభించారు. శ్రీకాళహస్తి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ కోసం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ వయ్యాల కృష్టారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అలానే నర్సపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలంటూ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్ ను పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పడం.. పల్నాడు ప్రాంతంలోని గురజాల ప్రజలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా కేంద్రాన్ని గురజాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్స్ మిన్నంటుతున్నాయి. జిల్లా కలెక్టర్ కు అఖిలపక్షం నేతలు ఇప్పటికే వినతి పత్రం అందజేశారు. ఇలా కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు అంశం అగ్గిమీద గుగ్గిలంగా మారింది! రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి!!
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!