చిత్తూరు జిల్లా రిజర్వాయర్ల పనుల ఆపండి..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( ఎన్టీటీ ) అనుమతులేకుండా చిత్తూరు జిల్లా రిజర్వాయర్ల పనులు ఎలా ప్రారంభించారని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది. తక్షణమే జిల్లా పరిథిలో ప్రారంభించిన ఆ మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యవరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. రిజర్వాయర్ల నిర్మాణంలో పర్యావరణాన్ని ఎందుకు అంచన వేయకుండా ప్రారంభించారని ప్రశ్నించింది. తాగునీరు ఎంత అవసరమో.. పర్యావరణం కూడా మానవాళికి అంతే అవసరమని ఎన్జీటీ గుర్తు చేసింది.
సమతుల్యతకు నీళ్లొదిస్తే ఎలా?
ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, అభివృద్థి కార్యక్రమాలలో పర్యావరణ సమతుల్యతను తప్పనిసరిగా పాలించాల్సిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతోంది. అటువంటిది జగన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ చూపడంలేదు అన్నది ఎన్జీటీ ఆరోపణ. చిత్తూరు జిల్లా పరిధిలో గాలేదు-నగరి, హంద్రీ – నీవా ప్రాజెక్టులో భాగంగా మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అదనంగా చేపట్టింది. గతంలో ఇషి అనుమతులు పొందిన ప్రాజెక్టుల విస్తరణలో భాగంగానే రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణ ముప్పు ఉండదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయినా.. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది!
Must Read:-సీఎం జగన్ తో అలీ భేటీ! అందుకేనా?











