చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. జగన్ కుట్ర కారణంగానేచంద్రబాబు అరెస్టయ్యారన్న అభిప్రాయం అందరిలోనూ స్థిరపడిపోయింది. తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణలో లక్షల మంది తెలుగుదేశం అభిమానులున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మాత్రం చంద్రబాబు అరెస్ట్ పై డ్రామాలు ఆడుతోంది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ర్యాలీలెందుకంటూ ఐటి ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఆ తర్వాత ఖమ్మంలో ఆకస్మికంగా పర్యటించాక రూటు మార్చారు. ఆంధ్రవాళ్లతో తనకెలాంటి విభేదాలు లేవన్న కేటీఆర్, చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని ఆయకు ఏం జరగాలో అదే జరుగుతుందని అంటూ నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన కేటీఆర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని హడావుడిగా ప్రారంభించారు. తన తండ్రి ముఖ్యమంత్రి కేటీఆర్‌కు రాజకీయ గురువైన ఎన్టీఆర్‌ను పొగిడేసి డామేజ్ కంట్రోల్ చేసేప్రయత్నించారు. అయితే ఐటి ఉద్యోగుల ర్యాలీలకు అనుమతి ఇవ్వమంటూ తెగేసి చెప్పిన కేటీఆర్‌పై, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఐటి ఉద్యోగులంతా మంత్రి కేటీఆర్‌ను,బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను వెనుక ఢిల్లీ పెద్దల ప్లాన్ ఉందన్న వార్తల నేపథ్యంలో కేంద్రాన్ని విమర్శిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ఆచితూచి బీఆర్‌ఎస్ అడుగులేప్తోంది.
త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అభిమానుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని, మొన్నామధ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తాజాగా మంత్రి తలసాని కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. బాబు అరెస్ట్ దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా తలసాని పని చేశారు. ఒకరంగా చెప్పాలంటే తలసానికి రాజకీయ గురువు చంద్రబాబే. ఇలాంటి నేతలు చాలా మంది ఇప్పుడు బీఆర్‌ఎస్ లో ఉన్నారు. అయితే మొదట్లో చంద్రబాబు అరెస్ట్ పై నోరు పెదపని నేతలు నెల రోజుల తర్వాత మాట్లాటం చూస్తే ఎన్నికల డ్రామాలేనని అభిప్రాయం అందరిలోనూ ఉంది.
ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్ చంద్రబాబు బ్రాండ్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో...