పోలీసులంటే వైఎస్ కుటుంబానికి ఎందుకంత ఎలర్జీ..?
స్టేషన్లపై దాడులు, పోలీసులనే కొట్టడం…వైఎస్ ఫ్యామిలీ క్రిమినల్ నేచర్ కాదా..?
నాడు తాత, తండ్రి, అన్న…నేడు తల్లీకూతుళ్ల దాడి…అప్పుడు, ఇప్పుడు బాధితులు పోలీసులే..
బీ వేర్ ఆఫ్ వైఎస్ ఫ్యామిలీ…మైడియర్ పోలీస్…
నేరగాళ్లకు, పోలీసులకు మధ్య పాము-ముంగిసలా జాతివైరం ఉంటుందంటారు..ఇక కుటుంబం కుటుంబం మొత్తం నేరపూరిత స్వభావితం అయితే, పోలీసులపై వాళ్లకుండే కక్ష చెప్పనలవి కానిది..
నేరగాళ్లలో పోలీసులంటే తగని కక్ష పేరుకుపోయి ఉంటుందని, ఆయా సందర్భాల్లో ఆ కక్ష పోలీసులపై దాడుల రూపంలో, ఆస్తుల విధ్వంసం, దహనాల రూపంలో, స్టేషన్లపై దాడుల రూపంలో బైటకు వస్తుందనేది కూడా గత సంఘటనలను బట్టే తెలుస్తోంది..
ప్రభుత్వంలో తమకు వత్తాసు పలికేవాళ్లుంటే నేరగాళ్ల బరితెగింపునకు హద్దు అదుపనేది ఉండదు.. అలాంటిది ఆ నేరగాళ్లకే అధికారం తోడైతే, వాళ్లే పాలకులైతే, సదరు నేరగాళ్లలోని నేర ప్రవృత్తి ఎలా బైటకు తన్నుకొస్తుందనేదానికి సాక్షాత్తూ వైఎస్ కుటుంబమే ప్రత్యక్ష సాక్ష్యం..
బంజారాహిల్స్ పోలీసులపై ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలు కొట్టడం నేపథ్యంలో వైఎస్ కుటుంబ నేర స్వభావంపై మళ్లీ తాజా చర్చకు తెరలేపింది..
జగన్మోహన్ రెడ్డి కుటుంబ నేరచరిత్ర మరోసారి చర్చనీయాంశమైంది..ఆయన తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తమ్ముడు అవినాశ్ రెడ్డి, బాబాయి భాస్కర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాధ్ రెడ్డిల సరసన తాజాగా చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ చేరడం వెనుక చరిత్ర గుర్తుచేస్తున్నారు..
తనకు ఉద్యోగం ఇచ్చిన గనుల యజమాని వెంకటనర్సయ్యను చంపిన కేసులో జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ప్రధాన నిందితుడు(144బై 75). తర్వాత ఆ గనిని ఆక్రమించాడు. తాను చెప్పినట్లు బిల్లులు పెట్టలేదని ఇంజనీరింగ్ అధికారులను అప్పట్లోనే చితకబాదాడు. రాజారెడ్డిపై రౌడీ షీట్ నమోదైంది కూడా( నెం 381, 1966). ఊసన్న అనే గిరిజనుడిని 1964లో సజీవ దహనం చేశాడు. రాజారెడ్డిపై రౌడీషీట్ తెరిచి జిల్లా బహిష్కరణ శిక్ష విధించారు..జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి, తాత రాజారెడ్డిపై 34కేసులు నమోదయ్యాయి..
22ఏళ్ల వయసులోనే పోలీస్ స్టేషన్ పై దాడిచేసి ఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడిన నేరచరిత్ర జగన్మోహన్ రెడ్డిది..సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డిపై 1994లో కేసు నమోదైంది..ఎస్సై ప్రకాశ్ బాబును దూషించడమే కాకుండా విధులకు ఆటంకం కల్పించడంపై ఐపిసి 147,148,448,353 రెడ్ విత్ ఐపిసి 149కింద కేసు నమోదైంది.
పరిటాల రవి హత్యకు సూట్ కేసు బాంబు కుట్ర ఎఫ్ ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది..ఈ కేసులో మంగలి కృష్ణకు రూ 5లక్షల ఆర్ధిక సాయం అందించారని సాక్షాత్తూ వైఎస్ కేబినెట్ లో మంత్రే చెప్పారు, ఆ కేసునుంచి జగన్ ను బైటపడేయడానికి తాను 60రోజులు కష్టబడ్డానని అప్పటి చీప్ విప్ చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడే 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడ్డాడనే ఆరోపణ ఉంది..1986-87లో మరొకరితో కలిసి జగన్మోహన్ రెడ్డి మేడ్చల్ లోని శివశివానీ పబ్లిక్ స్కూలులో ప్రశ్నపత్రాల లీకేజిపై మేడ్చల్ స్టేషన్ లో, కోర్టులో విచారణ తెలిసిందే.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రొ కో కు పాల్పడటం, రూ 43వేల కోట్ల దోపిడీకి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడని సిబిఐ అఫిడవిట్ లో పేర్కొంది. అవినీతి, అక్రమాస్తులు, హవాలా, మనీ లాండరింగ్, సూట్ కేసు కంపెనీలపై సిబిఐ, ఈడి ఛార్జిషీట్లు 16కు పైగా నమోదు కావడం, సెక్షన్ 120 బి, 420, 409, 419, 468, 471, 477(ఏ), అవినీతి నిరోధక చట్టం 13(1), 13(2), మనీ లాండరింగ్ యాక్ట్ 9,1,12,13(3), 13(1)(సి)(డి) అనేక సెక్షన్ల కింద, పిఎంఎల్ ఏ, ఫెమా వంటి పలు కేసులున్నాయి.. అండర్ ట్రయిల్ ప్రిజనర్ 6093 గా, 16నెలలు జైల్లో ఉన్నాడు..
ఇక జగన్ తండ్రి రాజశేఖర రెడ్డిపై సెక్రటేరియట్ లోనే కాల్పులు జరగడం తెలిసిందే..రాజారెడ్డితో కలిసి ఆయనపై 34కేసులు ఉన్నాయి.
సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మరో చిన్నాన్న వైఎస్ భాస్కర రెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. జగన్ సోదరుడైన కడప ఎంపి వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్యలో సహనిందితుడుగా ఉన్నాడు..ఈ హత్యకేసు కాకుండా అవినాశ్ రెడ్డిపై ఐపిసి 147,148,186,188,114, 353,341,342,290,427,506, 440,286,283,452 సెక్షన్ల కింద కేసులున్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ లోనే పేర్కొన్నారు.
ఇక జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డిపై ఐపిసి 420, 7(1), 196, 188,341,343, 143, 323, 363, 341, 506, 34, 468,471, 473 కింద 2011లో క్రైమ్ నెం 80, క్రైమ్ నెం 37, క్రైమ్ నెం 228 మరియు 2013లో క్రైమ్ నెం 25 తదితర కేసులున్నాయి..
ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల బంజారాహిల్స్ పోలీసులపై దాడిచేసి కొట్టడం వైఎస్ కుటుంబ నేర ప్రవృత్తికి అద్దం పట్టింది..ఈ కేసులో షర్మిలతో పాటు డ్రైవర్ బాలు, జాకబ్ పై ఐపిసి సెక్షన్ 332, 353, 509, 427, 109, 337 రెడ్ విత్ 34కింద కేసులు నమోదయ్యాయి..14రోజులు రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు పంపారు.
వైఎస్ షర్మిల అరెస్టుతో జూబ్లీహిల్స్ స్టేషన్ కొచ్చిన జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్న మహిళా కానిస్టేబుళ్లపై విజయమ్మ చేయి చేసుకోవడం దేశం మొత్తం చూసింది. తల్లీ కూతుళ్లిలా పోలీసులనే కొట్టడం చూసి జనం విస్తుపోయారు.
పోలీసులంటే వైఎస్ కుటుంబానికేదో ఎలర్జీ ఉందని, వాళ్ల నేరాలు-ఘోరాలను అడ్డుకుంటారనే కక్ష కొన్నేళ్లుగా పోలీసులపై పేరుకు పోయిందని, అందుకే గతంలో సింహాద్రిపురం పోలీసులపై జగన్మోహన్ రెడ్డిగాని, ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులపై షర్మిలగాని, వారి తల్లి విజయమ్మగాని ఇలా దాడులు చేయడాన్ని ఉదహరిస్తున్నారు..
కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులూ తస్మాత్ జాగ్రత్త..వైల్ డీలింగ్ విత్ వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్..లేకపోతే మీరే కాదు మొత్తం ప్రజానీకానికే పెను ప్రమాదం..
పాములకు పాలుపోసి పెంచడం ఎంత ప్రమాదమో మన పోలీసులు ఇకనైనా తెలుసుకోవడం వారికేకాదు మొత్తం సమాజానికే మంచిది.