కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫేక్ ప్రచారాలు చేయడం వెనుక వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మీడియా వ్యవహారాలు చూసే పూడి శ్రీహరి ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
బస్సు ప్రమాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 27 మందిపై కర్నూలు తాలూకా స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పలువురు నిందితులను విచారించారు పోలీసులు. వారిచ్చిన సమాచారం మేరకు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఉండే శ్రీహరి పాత్ర ఉన్నట్లు తేలడంతో అతని పేరును కూడా చేర్చి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు.
ఇక, పూడి శ్రీహరి నేరాలు అన్నీఇన్ని కావు. మాజీ ఐపీఎస్ AB వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌కు ప్రధాన కారణం పూడి శ్రీహరే కారణం. అప్పట్లో CPROగా ఉన్న శ్రీహరి..AB వెంకటేశ్వర రావుపై అనేక తప్పుడు ప్రచారాలను అధికారిక మీడియా గ్రూపుల్లో షేర్ చేసేవారు. ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు ఉండేవి కావు. ఇదే విషయాన్ని AB కూడా గతంలో చాలా సార్లు చెప్పారు. చివరగా AB వెంకటేశ్వరరావు ఎలాంటి నేరాలు చేయలేదని తేలిపోయింది. కానీ విలువైన 5 సంవత్సరాల సర్సీస్‌ను AB కోల్పోయారు. ఆయనను మానసికంగా వేధించారు. దీంతో ఇప్పుడు పూడి శ్రీహరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన వ్యక్తిగా మాజీ ఐపీఎస్ కోరుకుంటారు.
ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు పైనే కాదు..టీడీపీ నేతలపై గతంలో జరిగిన వ్యక్తిత్వ హననం వెనుక మాస్టర్ మైండ్ పూడి శ్రీహరి. ఇప్పుడు పూడి శ్రీహరి అడ్డంగా బుక్ అవడంతో ఆయనను నోటీసులతో వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బాధితులు కోరుకుంటున్నారు











