తెలంగాణకు చెందిన ఓ స్టూడెంట్ కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ విద్యాభ్యాసం కొనసాగిస్తూ, ఫోన్ లో తల్లిదండ్రులను పలకరించేవాడు. అయితే ఇవాళ కెనడాలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్యహత్య చేసుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండే ప్రవీణ్, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చనిపోవడంతో సొంతూరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ మృతిపై వాళ్ల తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read:తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్