పొందూరు మండలం రాపాక జంక్షన్ కు చెందిన ఓ యువతి అక్రమ మద్యం అమ్ముతున్నట్లు ఫిర్యాదు రావడంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు. దాడి చేసిన పోలీసులకు అక్రమంగా నిల్వ చేసిన 11 బాటిల్స్ దొరికాయి. దీంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మహిళా అనే విషయం కూడా పట్టించుకోని ఆ ఎస్ఐ ఆమెను 24 గంటలు పాటు స్టేషన్ లోనే ఉంచారు. ఓ శుభకార్యక్రమానికి ఈ మద్యాన్ని తెచ్చానని అమ్మకానికి కాదని ఆమే ఎంత ప్రాధేయపడినా ఆ ఎస్ఐ కనికరించలేదు. ఆ క్షణంలో ఎస్ఐ గారికి వక్ర బుద్ది పుట్టింది. కేసు పెట్టకుండా ఉండాలంటే తన వాంఛను తీర్చాలని ఆమెను అడిగాడు. అతని కోరికను తోసిపుచ్చిన ఆమె ధీనంగా వేడుకొంది.
స్టేషన్ నుంచి బయట పడిన ఆమెకు ఆ ఎస్ఐ నుంచి వేధింపులు ఆగలేదు. అతని వేధింపులు శృతి మించడటంతో ఆమె ఓ మంచి పథకం సిద్ధం చేసింది. అతని ఫోన్ కాల్ రికార్డు చేసి బయట పెట్టింది. దీంతో ప్రపంచానికి అతని వికృత చేష్టలు తెలిసి వచ్చాయి. ఆమె విడుదల చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసు బాసులు ఎలా స్పందిస్తారో చూడాలి.