రాష్ట్రంలో సీఎం జగన్ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, ప్రజలు చీదరించుకుంటున్నా జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదని ఆయన విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలన్నీ బలవంతంగా వైసీపీ వాళ్లు చేయించుకున్నవే గానీ ప్రజల ఆమోదంతో కాలేదని అన్నారు. ఎమ్మెల్యేలకు సీఎం దగ్గరకు వెళ్లి పనులు అడిగే ధైర్యం లేదని, వీరికి అపాయింట్‌మెంట్ కూడా దొరకదని ఆయన విమర్శించారు. మంత్రులకు బూతులు తప్ప మంచిగా మాట్లాడడం రాదని, దీంతో.. ఇది బూతుల ప్రభుత్వంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎన్నికలు ఎక్కడా ప్రజాస్వామ్యంగా జరగడం లేదని డబ్బు, మాంసం, మందుతో జరుగుతున్నాయని కోట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తూ వైసీపీ గెలుస్తోందని ఆరోపించారు. టీడీపీ హయంలోనే గ్రామాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ.. మంచి ఫలితాలు సాధిస్తోందని, ఇది వైసీపీకి గుణపాఠం కావాలని ఆయన తెలిపారు.
Must Read ;- బలవంతపు విత్‌డ్రాలపై ఫిర్యాదులు పరిశీలించండి.. ఎస్ఈసీ ఆదేశం











