యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆమధ్య అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అంతే కాకుండా.. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను ఎన్టీఆర్ ఇంటికి సమీపంలో ప్రత్యేకంగా రూపొందించారు. డిసెంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందించాలి అనుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిందని సమాచారం.
ఇంతకీ విషయం ఏంటంటే.. వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ చేతికి చిన్న గాయం అయ్యింది. హాస్పటల్ కి వెళితే డాక్టర్లు చిన్న సర్జరీ చేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలనుకున్నారు. అయితే.. దీపావళి సందర్భంగా తన కొడుకులతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే.. డాక్టర్లు కనీసం రెండు నెలల రెస్ట్ తీసుకోమని చెప్పారట.
అలాగే కొరటాల శివతో చేయనున్న మూవీ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గాలి. ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా నటించనున్నాడు. అందుచేత లుక్ లో చాలా ఛేంజ్ రావాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది. అందువల్ల ఫిబ్రవరి లోపు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని.. అందుకనే ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.











