దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన హీరోల్లో రజనీకాంత్ ఒకరు. కేవలం ఆయన నటనకే కాకుండా తన సరళతకు
కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే ఆయన అభిమానులకు అదొక పండుగ లానే భావిస్తుంటారు. సినిమా సెట్స్ పైకి వెళ్ళాక ముందు నుంచే ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.టైటిల్ దగ్గర నుంచి అందరూ దృష్టి పెడుతుంటారు. రజనీ సినిమాకి ఆయన స్థాయికి తగినట్టుగా టైటిల్ పవర్ఫుల్ గా ఉండాలని అభిమానులు ఎప్పుడూ కోరుకుంటారు. లేదంటే అసంతృప్తికి లోనై తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు.
ఇదిలా ఉంటే రజనీ ప్రస్తుతం కెరీర్ లో తన 169వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణంలో చేస్తున్నారు.ఈ సినిమాకి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బీస్ట్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న నెల్సన్ రజనీతోనూ హిట్ కొట్టాలని చూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ‘బాస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన అవకాశం ఉందని సమాచారం.
భారీ బడ్జెట్ తో నిర్మితమవబోతున్న ఈ మూవీలో రజనీ సరసన కథానాయికగా ఐశ్వర్యరాయ్ నటించనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చర్చ జరగుతోంది.ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.ఇక సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా రజనీకాంత్ సినిమా సెట్స్ పైకి వెళుతోందన్న వార్తలు వినిపించడంతో ఆయన అభిమానుల్లో ఒక రకమైన కుతూహలం మొదలైనట్లుగా కనిపిస్తోంది.