లాస్టియర్ ‘పిట్టకథ’ మూవీ తో మెప్పించిన యువ దర్శకుడు అనుదీప్ కేవీ.. ఈ ఏడాది .. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఏకంగా టాలీవుడ్ లో సంచలనమే సృష్టించాడు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో .. ఫరియా అబ్దుల్లా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ గా రూపొందింది. ఓవర్సీస్ లో సైతం షాకింగ్ కలెక్షన్స్ రాబట్టిన జాతిరత్నాలు మూవీ .. దర్శకుడు అనుదీప్ కు మాత్రం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో అనుదీప్ ప్రస్తుతం మూడు సినిమాలకు కథల్ని రెడీ చేసు కున్నాడట.
మూడు కథల్లో ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందట. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఒక అమ్మాయిని పడగొట్టాలనుకొనే ఓ కుర్రోడి కథగా కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట సినిమా. ఇది కూడా వైజయంతి బ్యానర్ లోనే నిర్మాణం జరుపుకోనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందట. ఇక ఇందులో ఎవరు హీరోగా నటిస్తారో అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా నవీన్ పోలిశెట్టినే హీరోగా ఎంపిక చేయవచ్చనే టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో , హీరో ఎవరవుతారో చూడాలి.
Must Read ;- 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసిన ‘జాతిరత్నాలు’











