ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్ష కుమార్.రాష్ట్రపతి ఎన్నికల ద్వారా అపరిష్కృతంగా మిగిలి పోయిన రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకునే అవకాశం చిక్కిందని, ఈ క్రమంలో వైకాపా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అన్నారు.ఏపీ సమస్యలు పరిష్కారానికి కేంద్రం ముందుకు వస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటామని చెబితేనే కేంద్రం దిగివస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విభజిట ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కేంద్రం ముందోక మాట, తర్వాత ఒక మాట చెప్పి మోసం చేసిందనాయి హర్ష కుమార్ విమర్శించారు. వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కఠినంగా ఉంటేనే ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయని, కాబట్టి ఈ అవకాశాన్ని అధికార వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటిస్తే కేంద్రం ఖచ్చితంగా దిగివస్తుందని హర్ష కుమార్ స్పష్టం చేశారు. ఇది రాష్ట్రానికి దక్కిన చక్కని అవకాశమని, దీనిని సరిగ్గా వినియోగపరుచుకునేలా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు చేయాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడి మాట్లాడకుండా కూర్చుంటే, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారని హర్షకుమార్ అన్నారు.