పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ‘సాహో’ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో రాధాకృష్ణ కుమార్ పై ఒత్తిడి పెరిగిందని చెప్పచ్చు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తోంది. భారీ పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న దీని అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
న్యూయర్ సందర్భంగా ‘రాధేశ్యామ్’ గురించి అప్ డేట్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులు.. తీరా ఎలాంటి అప్ డేట్ రాకపోడంతో చాలా ఫీలయ్యారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ లో స్పందించారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. రాధేశ్యామ్ టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ చాలా త్వరగా వస్తుంది. అప్పటి వరకు ఓపికగా వేచి ఉండండి. ఎదురుచూపులకు తగ్గా ఫలితం ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే… లక్షల నవ్వుల సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ విషయంలో నేను ప్రామిస్ చేస్తున్నాను అన్నారు. రాధాకృష్ణ కుమార్ ప్రామీస్ తో రాధేశ్యామ్ టీజర్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహోతో ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్.. రాధేశ్యామ్ తో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి.