కేజీఎఫ్ 2 టీజర్ తో కేక పుట్టించిన ప్రశాంత్ నీల్ ఈసారి సలార్ టీజర్ తోనూ అదే పని చేయనున్నాడా? ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ ఎంతో నిరుత్సాహ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుంత ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్ మూవీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం, కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత విడుదల్లే సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం 5.12కు ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
కేజీఎఫ్ నిర్మించిన హోంబాలే సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించింది. సెప్టెంబరు 28న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో హీరో ప్రభాస్‍కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు తదితరులు ఉన్నారు. ప్రభాస్ ఊరమాస్ పాత్రలో కనిపించే సినిమా ఇది. గతంలో ఛత్రపతి మాదిరి పాత్ర కావచ్చు.
గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన చిత్రమిది. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి మరో ఎస్సెట్. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. గతంలో ప్రశాంత్ నీల్ రూపొందించిన ఉగ్రం సినిమాకు రీమేక్ గా మొదట్లో ప్రచారం సాగినా ఆ కథకూ దీనికి పొంతన లేదని అంటున్నారు. ముఖ్యంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్ కు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే సలార్ విజయం అనివార్యం.