ఊరికే రారు మహానుభావులు అంటారు.. ఊరికే కలవరు మహానుభావులు అనేది పాలిటిక్స్ సామెత.. అవును, టీడీపీ యువనేత లోకేష్, ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ భేటీ కూడా ఈ కోవలోకే వస్తుంది.. హస్తినలో ఈ ఇద్దరి భేటీపై ఏపీలోనూ కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.. టీడీపీకి ప్రశాంత్ కిశోర్ సలహాలు, సూచనలు అందించడం లేదు.. అలాంటి సమయంలో ఈ ఇద్దరి కలయికపై రాజకీయవర్గాలలో ఆసక్తి నెలకొంది..
రాజకీయ సలహాదారుగా కార్యకలాపాలకి బ్రేక్ ఇచ్చి, జన్ సురాజ్ పార్టీ పనులలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌కి ఇటీవల లోకేష్ ఓ టాస్క్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్, ఆ పార్టీకి గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితిపై ఓ రిపోర్ట్ చేసి ఇవ్వాలని రాబిన్ శర్మ టీమ్‌తోపాటు ప్రశాంత్ కిశోర్‌ని సైతం లోకేష్ కోరారని తెలుస్తోంది.. ఈ అంశాలపై గత నాలుగు నెలలుగా స్టడీ చేసిన పీకే టీమ్… సంచలన నివేదిక ఇచ్చిందని ఢిల్లీ రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది..
ఇదే అంశంపై విస్త్రతంగా అధ్యయనం చేసిన పీకే.. తెలంగాణలో టీడీపీకి కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికీ రెండంకెల ఓట్ బ్యాంక్ ఉందని తెలిపిందట.. కేడర్ ఫుల్‌గా ఉందని, కానీ, దానిని ఓట్ బ్యాంక్‌గా మలిచే లీడర్లు లేరని నివేదిక సమర్పించిందట పీకే టీమ్.. తెలంగాణలోనూ పార్టీని క్రియాశీలకంగా మారిస్తే భవిష్యత్ తిరుగు ఉండదని, మంచి సీట్లు, ఓట్లు రావడం ఖాయమని తేల్చి పారేసిందట రాబిన్ శర్మ, పీకే బృందం.. అయితే, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి..?? ఏ ప్రాంతాల్లో బీజేపీ – టీడీపీ – జనసేన పొత్తుకి పాజిటివ్ ఫలితాలు ఉంటాయనే అంశంపైనా ఈ బృందం సఅధ్యయం చేసిందని సమాచారం.. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే, మంచి ఫలితాలు రాబట్టవచ్చని, తెలంగాణలోనూ అధికారం దక్కించుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయని సూచించిందట పీకే టీమ్..
మరోవైపు, ఏపీలోనూ పలు అంశాలపై పీకే టీమ్ సలహాలు ఇచ్చిందని తెలుస్తోంది.. జగన్ వ్యూహాలకు కౌంటర్ ఇవ్వడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెంచితే వైసీపీకి చాన్స్ ఉండదని, 2029లోనూ టీడీపీ – జనసేన- బీజేపీ కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వివరించిందట పీకే బృందం.. మొత్తమ్మీద, ఢిల్లీ లోకేష్ టీమ్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది..