వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎంతటి రసికులో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఎంతగా రసికోక్తులు విసురుతారో గంటలో తేల్చేశారు సత్తెనపల్లి ప్రజలు.. ఆయన చలోక్తులు కూడా బాగా పేల్చుతారు.. తాజాగా అంబటి రాంబాబు ఓ జోక్ వేశారు.. మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిని చంపడానికి కొందరు ప్లాన్ చేశారని, దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు..
రెండు రోజుల క్రితం తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ముద్రగడ ఇంటిపైకి ఓ ట్రాక్టర్ దూసుకువచ్చింది.. ఓ యువకుడు ముద్రగడ నివాసం వైపు స్పీడ్‌గా ఓ ట్రాక్టర్‌ని డ్రైవ్ చేశాడు.. ఆయన ఇంటి ముందున్న కారు, ఫ్లెక్సీలు, పూలకుండీలను తొక్కించి పరారయ్యాడు.. గంగాధర్ అనే ఆ యువకుడిని ముద్రగడ అనుచరులు అడ్డుకొని దేహశుద్ధి చేశారు.. ఆయనపై కేసు నమోదు చేయగా, పోలీసులు అరెస్ట్ చేశారు.. దీనివెనుక భారీ కుట్ర ఉందని, ముద్రగడని అంతం చేసే స్కెచ్ ఇది అని అంబటి రాంబాబు, కన్నబాబు లాంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు..
మరోవైపు, తాను కేవలం మద్యం మత్తులో మాత్రమే ముద్రగడ ఇంటి ప్రహరీని ఢీ కొట్టానని, దీనివెనుక ఎలాంటి కుట్ర లేదని గంగాధర్ వాపోతున్నాడు.. తన వెనక ఎవరూ లేరని, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని కుండబద్దలు కొడుతున్నాడు ఆ యువకుడు.. వైసీపీ నేతలు దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు.
గత ఎన్నికలలో ముద్రగడ వైసీపీకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ గెలవడం ఖాయమని, ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు.. ఓటమి తర్వాత తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా సవరించుకున్నారు.. అంతేకాదు, తమకి ఇష్టం లేకపోయినా, ముద్రగడ వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ పేల్చిన అవాకులు, చెవాకులని విమర్శించారు ఆయన కూతురు.. ఇటు, ముద్రగడకు గుడ్ బై చెప్పి, జనసేనలో జాయిన్ అయ్యారు.. ఈ పరిణామాన్ని ముద్రగడ జీర్ణించుకోలేకపోయారు.. తనకు, తన కుటుంబాన్ని దూరం చేశారని వాపోయారు..
ముద్రగడ ఇమేజ్ పూర్తిగా డౌన్ అయింది.. 2014 -19 మధ్య టీడీపీ సర్కార్‌పై పళ్లెం, గంట మోగించి పోరాటం చేశారు.. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ఓ యుద్ధమే చేశారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పళ్లెం, గరిట మూగబోయింది.. జగన్ భజన చేసింది.. దీంతో, ఆయనపై కాపు ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసం సడలిపోయాయి. 2024 ఎన్నికలలో ముద్రగడ గ్రాఫ్ నేలను తాకింది.. ఆయన ప్రభావమే కనిపించలేదు.. ఇలాంటి సమయంలో ముద్రగడతోపాటు వైసీపీ నేతలు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు.. దీంతో, మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ముద్రగడని రెచ్చగొట్టాలని స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ – జనసేన మధ్య దూరం పెంచాలని ప్లాన్‌లు సిద్ధం చేసుకుంటున్నారు.. ప్రజలు అంత పిచ్చి గొర్రెలు కారని తేల్చి చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. ఇలాంటి రాజనాల టైమ్ రాజకీయ కుట్రలు ఆపాలని తేల్చి చెబుతున్నారు.. మరి, వైసీపీ నేతలు త్వరలో ఎలాంటి స్కామ్‌లు, స్కీమ్‌లతో వస్తారో చూడాలి..