బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా స్థానం ప్రత్యేకం. ఆల్రెడీ ఆమె చేసిన సినిమాలు కావాల్సినంత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ క్రేజ్ తగ్గకుండా చూసుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. అప్పుడప్పుడు తన కెరియర్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే ప్రియాంక చోప్రా, తన భర్తతో కలిసి ముద్దు ముచ్చట్లు పంచుకునే ఫోటోలను కూడా షేర్ చేస్తూ, అందరి కళ్లలో .. నోళ్లలో నానుతూ ఉంటుంది. అల్లరి తనానికీ .. చిలిపితనానికి కేరాఫ్ అడ్రెస్ గా ఈ జంట కనిపిస్తూ ఉంటుంది.
ఇన్ స్టా గ్రామ్ లో ప్రియాంక చోప్రాకి 60 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రియాంక చోప్రా ఏ రోజున ఏం చేస్తుందా అని వాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాళ్లను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో, ఏదో ఒక సందర్భంలో ఆమె ఒక ఫొటో కొట్టేసి పోస్ట్ చేసేస్తుంది. అంతే ఇక ఫాలోవర్స్ అంతా కూడా ఎగబడి చూసేస్తుంటారు. తాజాగా ఆమె ఎరుపు రంగు బికినీ ఫొటోని కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు. ఇప్పుడు అంతా ఈ ఫొటోని గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఈ ఫొటోలో ప్రియాంక తడిసిన అందాలతో ఊరించడమే.
అందానికి ఒక లక్షణముంది .. తడిస్తే చాలు అందం అమాంతంగా పెరుగుతుంది .. క్రేజ్ తోడైతే చాలు మరింత అందంగా మెరుస్తుంది. అలా క్రేజ్ .. గ్లామర్ కలిగిన ప్రియాంక చోప్రా తడిసిన అందాలతో మెరిస్తే ఎలా ఉంటుంది? కుంకుమపువ్వు రంగు మేనిఛాయ .. ఎద పొంగులను వెతుక్కుంటూ వెళుతున్న నీటి ముత్యాలు .. హాట్ లుక్కంటే ఇది అన్నట్టుగా ఒక కన్ను మూసేసి ఆమె ‘వి’ సింబల్ చూపిస్తోంది. ఆ తరువాత ప్రియాంక వెంటనే డ్రెస్ మార్చేసుకుని ఎంచక్కా ఏ షాపింగ్ కో వెళ్లిపోయి ఉంటుంది. కానీ పాపం .. కుర్రాళ్ల పరిస్థితి? ఆ ఫొటోని అదే పనిగా చూసి చూసి, ఎటు చూసినా ఎరుపురంగే కనిపిస్తోందని కంగారుతున్నారుట. ఎర్ర బికినీ ఎంత పనిచేసిందబ్బా?
Must Read ;- పడుచు గుండెలను పేల్చేస్తున్న పిల్ల ఫిరంగి