బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం బచ్చన్ పాండే. ఇందులో కృతిసనన్ కథానాయిక. ఈ మూవీ జైసల్మేర్లో షూటంగ్ జరుగుతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, కృతిసనన్, అర్షద్ వార్సీ తదితర ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టీమ్ రిపబ్లిక్ వేడుకలను ఆర్మీతో కలిసి జరుపుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డేకి అనగా 2022 జనవరి 26న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బారత క్రికెటర్ శిఖర్ థావన్.. అక్షయ్ కుమార్ ని ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో కలిశారు. ఫలితంగా అద్భుతమైన సెల్ఫీ వచ్చింది. ఈ సెల్ఫీ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తుంది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. రాజస్ధాన్ లో అక్షయ్ కుమార్, కృతిసనన్ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇప్పుడు అక్షయ్, థావన్ సెల్ఫీతో మరోసారి ఈ మూవీ వార్తల్లో నిలిచింది.
ఈ సెల్పీలో భారత క్రికెటర్ ఎర్రటి డ్రెస్ చల్లని సన్ గ్లాసెస్‌తో ఉంటే.. అక్షయ్ బూడిద రంగు డ్రెస్ నుదిటి చుట్టూ క్లాత్ కట్టుకుని ఉన్నారు . షూటింగ్ స్పాట్ కి దగ్గరలో ఈ సెల్ఫీ తీసుకున్నారు. వీరిద్దరూ ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తమ సంతోషాన్ని షేర్ చేశారు. ఈ పోస్ట్ కి అనూహ్యమైన స్పందన రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Must Read ;- కేటీఆర్‌తో హనుమ విహారి భేటీ.. అసలు కారణం అదేనా?