ఎప్పటికప్పుడు సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ కెరీర్ పరంగా మంచి బ్రేక్ రాకపోవడం వేదికను ఒకింత ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ సరసన “విజయదశమి”లో నటించడం ద్వారా అప్పట్లో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత లారెన్స్ “కాంచన 3” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. మధ్యలో తమిళంతో పాటు మలయాళ, కన్నడ చిత్రాలలో ఎక్కడ అవకాశం వచ్చినా నటిస్తూ వచ్చిన ఆమె తెలుగులో కెరీర్ మలుపు కోసం పెట్టుకున్న ఆశలు మాత్రం ఫలించలేదు.

గత ఏడాది బాలకృష్ణ సరసన “రూలర్” చిత్రంలో నటించే అవకాశం రావడంతో పాటు బాలీవుడ్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఆమెకు లభించింది. ఇమ్రాన్ హష్మి సరసన బాలీవుడ్లో “ది బాడీ” అనే చిత్రంలో ఆమె నటించింది. ఈ రెండు చిత్రాలు గత ఏడాది డిసెంబర్లో విడుదలయ్యాయి. వీటి తర్వాతైనా స్టార్ హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరి వరుస ఆఫర్లు తలుపు తడతాయని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది.

ఈ మధ్యనే ఆటవిడుపుగా మాల్దీవులకు వెళ్లి కొద్దిరోజులపాటు సేదతీరింది. అక్కడ బికినీ ఫోజులతో హాట్ హాట్ గా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారు మతులు పోగొట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో ఆమె నటించిన రెండు చిత్రాలు నిర్మాణాంతర పనుల్లో ఉన్నాయి. ఇక తెలుగు, తమిళ బాషలలో రూపొందుతున్న `జంగిల్” చిత్రం ద్వారానైనా బ్రేక్ వస్తుందేమోనని ఆమె నమ్మకంగా ఉంది. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నారు.
Must Read ;- త్వరలో హనీమూన్ కు నీహారిక దంపతులు











