హిందీ టీవీ సీరియల్స్ చూసేవారికి ‘నియా శర్మ’ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ‘ఖత్రోమ్ కా ఖిలాడీ’ కంటెస్టెంట్ గా ఆమె బాగా పాపులర్. నియాశర్మ మొదటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకుని, కుర్రకారు హృదయాలను పిండేసి ఆరేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ప్రతి కదలికలోను అందం ఉంది .. ప్రత్యేకత ఉందని కుర్రాళ్లు భావిస్తుంటారు. పట్టుతో నేసినట్టుగా .. పాలపిండితో తయారుచేసినట్టుగా అనిపించే ఈ బ్యూటీని పద్ధతిగా ఫాలో అవుతుంటారు.

రీసెంట్ గా ఆమె ఓ మేగజైన్ కోసం వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలలో కొన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె ధరించిన చోళీ .. ఈ అందాల బరువు బాధ్యతలను మోయడం తన వలన కాదన్నట్టుగా తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది. దాంతో ఎగసిపడే ఆమె ఎద సంపద,చూపుల ఉప్పెనను తట్టుకోవడానికి సిద్ధమవుతోంది. నీలాకాశాన్ని దుప్పటిగా కప్పుకోవడానికి ఆరాటపడుతోంది.

ఆరుబయట అందాలను ఆరేసి, నియాశర్మ తమకంతో కళ్లు మూసుకుంది. ఎన్ని చూపులు ఆ సొగసుల చెంతకు చేరిపోయాయో .. ఎన్ని ఆశలు అక్కడ అవతరించి ఆవరించాయనేది కళ్లు తెరిస్తే ఆమెకి అర్థమవుతుంది.పడుచు మనసులన్నీ పేరంటాలుగా వచ్చిందీ .. కొంటె చూపులన్నీ కోలాటాలు ఆడుతున్నది ఆమెకి స్పష్టమవుతుంది. అయితే ఈ ఫొటోలో నియా శర్మ కళ్లు మూసుకుని దేవుణ్ణి ఏదో అడుగుతుందని కూడా అనుకోవాలి. ఉన్న అందాలన్నీ తన ఒక్కదానికే ఇచ్చేసినందుకు థ్యాంక్స్ చెబుతుందా? లేదంటే ఈ అందాల దాడిని తట్టుకునే శక్తిని కుర్రాళ్లకు ఇవ్వమని కోరుకుంటుందా? అనేదే అర్థం కావడం లేదు.
Must Read ;- టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి










