అందాల అనుష్కశెట్టి ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ విడుదల హడావిడిలో ఉంది. రేపే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని జేజమ్మ ముమ్మరం చేసింది. పనిలో పనిగా.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ స్వీటీ ప్రమోషన్స్ అదరగొట్టేస్తోంది. ఆల్రెడీ అమ్మడికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో భారీ ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇంత వరకూ ఆమెకు ట్విట్టర్ అకౌంట్ లేదు. రీసెంట్ గా అంటే.. నిన్నరాత్రి అనుష్క ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంది. అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
అనుష్క ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన వెంటనే .. ఆమెకు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అంతేకాదు ఆమె ఇలా అడుగుపెట్టిందో లేదో అప్పుడే రికార్డు స్థాయిలో.. 899.7k ఫాలోవర్స్ ఏర్పడిపోయారు. ఆల్రెడీ ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో 3.8 మిలియన్ ఫాలోవర్స్ , ఫేస్ బుక్ లో 14మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. రేపే ‘నిశ్శబ్దం’ విడుదలవుతున్న సందర్భంగా.. ఆమె ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడంతో.. అభిమాను ఆనందం పట్టలేకపోతున్నారు. మరి ఆమె ఫాలోవర్స్ ఇంకే రేంజ్ లో పెరగుతారో చూడాలి.











