నారా లోకేష్ పై ఆయన మేనత్త, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆమె.. పెద్దమ్మగా తన సోదరి కుమారుడు లోకేష్ పై ఎప్పుడూ ప్రేమ అభిమానం ఉంటుందని, లోకేష్ కు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. లోకేష్ జీవిత ప్రయాణంలో తాను వెళ్లాలనుకునే మార్గాన్ని స్వతంత్రంగా ఎంపిక చేసుకోవచ్చని, ఆ ఆలోచన , వివేకం రెండూ లోకేష్ కి ఉన్నాయని ఆమె తెలిపారు.
కాగా తన భర్త, కొడుకు వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారా అని ఆ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బాదులిస్తూ.. చాలా కాలం క్రితమే వారు ఆ పార్టీ నుంచి వైదొలిగారని స్పష్టం చేశారు. తన కుమారుడి నిర్ణయాన్ని తాను ఎప్పటికీ వ్యతిరేకించబోనని.. గతంలో రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తానంటే అభ్యంతరం చెప్పలేదని పురంధరేశ్వరి పేర్కొన్నారు.ఇక ఇప్పుడు తను వ్యాపారం చేయాలనుకుంటున్నానని తెలిపినా ప్రోత్సాహిస్తాను తప్పితే కాదనబోమని ఆమె స్పష్టం చేశారు.