స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో పుష్ప సినిమా పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. పుష్ప పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఈ సినిమాని ముందుగా తెలుగులో మాత్రమే చేయాలి అనుకున్నారు. ఆతర్వాత పాన్ ఇండియా మూవీగా.. రెండు పార్ట్ లుగా మార్చడం జరిగింది. తెలుగులో మాత్రమే చేయాలనుకుని ముందుగా హిందీ డబ్బింగ్ రైట్స్ ను వేరే సంస్థకు అమ్మేయడం జరిగింది. ఆతర్వాత పాన్ ఇండియా మూవీగా మార్చిన తర్వాత హిందీ డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న సంస్థ ఈ చిత్రాన్ని యుట్యూబ్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి.. నార్త్ లో థియేటర్లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో పుష్ప హిందీ వెర్సెన్ రిలీజ్ కావడం లేదని వార్తలు వచ్చాయి.
తాజా అప్ డేట్ ఏంటంటే.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చర్చలు ఫలించాయని.. అనుకున్నట్టుగానే పుష్ప బాలీవుడ్ లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి అంతా క్లియర్ అయ్యిందని సమాచారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్ధాయిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రమోషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ పాన్ ఇండియా మూవీతో బన్నీ, సుక్కు ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.











