స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. కరోనా సెకండ్ వేవ్ తో పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది. చాలా సినిమాలు షూటింగ్ ఆపేసినా పుష్ప మాత్రం షూటింగ్ కంటిన్యూ చేసింది. అయితే.. పరిస్థితులు మరింతగా విషమంగా మారడం.. ప్రభుత్వం కూడా లాక్ డౌన్ అనౌన్స్ చేయడంతో ఆఖరికి చేసేది ఏమీ లేక పుష్ప షూటింగ్ ఆపేశారు. పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులోని మొదటి పార్ట్ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా ఓ 25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఈ సినిమా ను ఆగస్టులో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కానీ.. షూటింగ్ నిలిచి పోవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు జులై 5 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిసింది. అల్లు అర్జున్.. రష్మిక మందన్నా మరియు ఫాహద్ లు జులై మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు డేట్లు కూడా ఇచ్చేశారని సమాచారం. అయితే… పుష్ప సినిమా షూటింగ్ రీ షెడ్యూల్ కన్ఫర్మ్ అవ్వడం.. జులై 1 నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తారని వార్తలు వస్తుండడంతో ఆగష్టు 13న విడుదల చేయాలనుకున్న పుష్ప యాధాప్రకారం విడుదల అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ప్రచారంలో ఉన్న వార్తలు నిజమా అంటూ అనుమానాలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు పుష్ప సినిమా పై స్పందిస్తూ… పది కేజీఎఫ్ లతో సమానం అంటూ చేసిన వ్యాఖ్యలు పుష్ప సినిమా పై అంచనాలు రెట్టింపు చేశాయని చెప్పచ్చు. అయితే.. ఆగష్టు 13నే పుష్ప వచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ.. అది సాధ్యంకాదని.. అవన్నీ గాసిప్స్ సమాచారం. ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కాస్త ఎక్కువ సమయం పడుతుందట. అందుచేత పుష్ప ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరంలో విడుదల అని సమాచారం











