ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్న రేంజిలో భయపడే సీఎం దేశంలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. విపక్ష నేతగా ఉన్న సమయంలో తనదైన శైలి దూకుడు ప్రదర్శించిన జగన్… సీఎం పదవి చేపట్టగానే ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన వెలగపూడిలోని సచివాలయం వెళ్లాలంటే…అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులను ఏ రేంజిలో మోహరిస్తున్నారో చూస్తేనే.. జగన్ ఏ రేంజిలో భయపడిపోతున్నారో ఇట్టే చెప్పేయొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
550 రోజుకు రాజధాని రైతుల నిరసనలు
తాజాగా జగన్ మరింత భయపడిపోతున్న వైనానికి నిదర్శనంగా శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం చుట్టూ భారీ ఎత్తున పోలీసులను ఏపీ ప్రభుత్వం మోహరించింది. దీనికి గల కారణం ఏమిటంటే… ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు రోజుల తరబడి నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిరసనలు శనివారం నాటికి 550వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే దిశగా రాజధాని రైతులు యత్నించే అవకాశాలున్నాయంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిందట. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిపోయిన జగన్… తన క్యాంపు కార్యాలయం చుట్టూ ఓ గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారట.
తాడేపల్లిలో భారీ భద్రత
సీఎం జగన్ ఆదేశించడమే తరువాయి… రంగంలోకి దిగిన పోలీసులు… జగన్ క్యాంపు కార్యాలయం చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధం చేశారట. అయితే ఉన్నపళంగా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే… పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయని భావించిన అధికారులు మధ్యేమార్గంగా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారట. ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం పరిసరాల్లో నివసించే వారికి ఓ సందేశం పంపించారట. తమకు తెలియకుండా కొత్తవారికి ఆశ్రయం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందేశంలో హెచ్చరికలు జారీ చేశారట. మొత్తంగా అమరావతి రైతుల ఆందోళనలకు భయపడి ఇప్పటికే పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకుని… రాజధాని గ్రామాల ప్రజలను బయటకే రాకుండా చేస్తున్న జగన్… ఇప్పుడు ఏకంగా తన నివాసం పరిధిలో మరింత మేర గట్టి భద్రతను ఏర్పాటు చేయించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
Must Read ;- దేవుడి దయతో ప్రత్యేక హోదా.. జగన్ చేతులెత్తేసినట్టేగా