అల్లు అర్జున్ – సుకుమార్.. ఆర్య, ఆర్య 2 తర్వాత చేస్తున్న సినిమా పుష్ప. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన పుష్ప లేటేస్ట్ ప్లాన్ ఇదే.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప టీజర్ కు యూట్యూబ్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండడంతో జులై నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబట్టి నిర్మాతలు పుష్ప మూవీని అన్ కాంప్రమైజ్డ్‌గా రూపొందిస్తున్నారు.
బన్నీ లేటెస్ట్ ప్లాన్ ఏంటంటే.. యాక్షన్ సన్నివేశాల విషయంలో ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాలో బోట్ ఫైట్‌ను సుకుమార్ ప్లాన్ చేశారట. టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో బోట్ ఫైట్స్ ఉన్నాయి. కానీ.. వాటన్నింటి కంటే భిన్నంగా, రిచ్‌గా ఉండేలా చిత్రీకరించనున్నారని సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంగా పుష్ప చిత్రం తెరకెక్కుతోంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ పార్ట్ ఇంకా 25 రోజులు షూటింగ్ చేయాల్సివుందని తెలిసింది.
ఈ 25 రోజుల షూటింగ్ ను రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేయాలనుకుంటున్నారట అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ మిగిలిన ఆర్టిస్టులు, వాళ్ల డే్ట్స్ ను బట్టి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను ఆగష్టు 13 రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. కరోనా కారణంగా పుష్ప రిలీజ్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.