టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు వచ్చాయి. పార్టీ మార్పుపై సోమవారం ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు. పవర్, మనీ కోసం పార్టీ మారనని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు ఏ విధమైన ప్రతిపాదన తన ముందు పెట్టలేదని తెలిపారు. ఎవరికీ ఇంకా ఏ హామీ ఇవ్వలేదని అన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడనని, ఇతరుల పదవులకు అడ్డుపడనని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం తన విధానం మార్చుకోనని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారని, తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాల ప్రభావమే తనపై ఉందని, టీడీపీ ఆరంభం నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నానని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఒకవేళ పార్టీ మారే ఉద్దేశమే ఉంటే ప్రజలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఎల్.రమణ స్పష్టం చేశారు.
Must Read ;- జరిగిన అభివృద్ధిపై చర్చ.. తెలంగాణ చూపు టీడీపీ వైపు