స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ఫ’ షూటింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలుగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇందులో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా స్మగ్లర్ గానే ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ ప్రారంభమైంది. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే. దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులు లేకుంటే మళ్లీ ఈ సంక్రాంతికి ‘పుష్ప’ సందడి ఉండేది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.