మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఈ నెల 9న అంటే ఈ రోజే నిజానికి సినిమా షూటింగ్ రీ స్టార్ట్ కావల్సింది. అయితే ఆయనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నాగబాబుకి కరోనా రాగా.. ఆయన దాన్నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత హీరో రాజశేఖర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అవుతున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు చిరంజీవికి కోరోనా పాటిజిటివ్ రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నారు కాబట్టి.. ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది.. కానీ ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే చిరు హోమ్ క్వారంటైన్ అయ్యారు. గత నాలుగైదు రోజులనుంచి తనని కలిసిన వారినందరినీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరారు ఆయన. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి తెలియచేస్తానని చిరంజీవి తెలిపారు.











