పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఈ భారీ పిరియాడిక్ మూవీని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్ అండ్ టీజర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. సాహో సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు సంక్రాంతికి రాధేశ్యామ్ వచ్చేందుకు ఫిక్స్ అయ్యింది. అయితే.. ఇప్పుడు రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయడానికి రంగం సిద్దమైందని సమాచారం. ఇంతకీ ఎప్పుడంటే.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో రాధేశ్యామ్ సినిమాకి సంబంధించి టీజర్ కటింగ్ జరుగుతుందని సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ టీజర్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి.. ఈ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.











