తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు హవా ఎవరిదంటే ఠక్కున వచ్చే సమాధానం ఒక్కటే అది బుట్టబొమ్మే. ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రభాస్ తో చేస్తున్న సినిమా లుక్ ఎలా ఉంటుందో తెలుసా.. ఇదిగో ఇలానే.. మీరు చూస్తున్న ఫోటోను ఆమె ట్విట్టర్ ద్వారా షేరే చేసింది. ఈ అరవింద లుక్ కు అదిరిపోయే స్పందన లభిస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో ఫస్ట్ లుక్ వచ్చేసింది.
పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళంలో కూడా ఇదే పాత్ర కాబట్టి అన్నింటిలోనూ ఈ లుక్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఇందులో ఆమెది ఎలాంటి పాత్ర అనే అనుమానం కలుగుతోంది కదూ. హీరో రాధేశ్యామ్ కు ఇన్ స్పైర్ చేసే పాత్ర ఇదట. పాత్ర పేరు కూడా ప్రేరణ అట. ఓ రైల్లో ’రాధే శ్యామ్’ పాత్రధారి ప్రభాస్కు ఎదురుగా కూర్చుని ఉన్న ఈ ఫోటో లో ఈ బుట్టబొమ్మ ఎంత క్యూట్ గా ఉందో కదూ.
ఈ సినిమా కథ కూడా కొత్తదనంతో కూడి ఉంటుంది. ఇది పూర్వ జన్మల కథ. మరి ఆ జన్మజన్మల అనుబంధం వీరిద్దరి మధ్యా ఎలా ఉంటుందో చూడాలి. బహుశా ఇద్దరికీ ఇందులో రెండు పాత్రలు అయి ఉండటానికే అవకాశం ఎక్కువ. కథ అలాంటిదే అయినప్పుడు తప్పదు మరి. ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు మూగమనసులు దగ్గరి నుంచి తెలుగులో ఇది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కాకపోతే దీన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లో హేపీ బర్త్ డే ప్రేరణ అని పేర్కొన్నారు.
Here's introducing @hegdepooja as 'Prerana' from #RadheShyam. #HappyBirthdayPoojaHegde
Starring #Prabhas & @hegdepooja
Directed by @director_radhaa
Presented by @UVKrishnamRaju garu
Produced by @UV_Creations @TSeries @itsBhushanKumar with #Vamshi #Pramod & @PraseedhaU pic.twitter.com/IYYBZ9nMF9— Radhaa Krishna (@director_radhaa) October 13, 2020











