తనను అరెస్టు చేసిన సమయంలో రూల్ ఆఫ్ లా అతిక్రమించిన తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు అన్ని వివరాలతో సుదీర్ఘ లేఖ రాశారు.ఓ ప్రజా ప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధి విధానాలు,మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఎంపీ రఘురామ తెలిపారు.ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.దీనిపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు,పోలీసు మాన్యువల్‌లో ఉన్నమార్గదర్శకాలను లేఖలో వివరించారు.సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ బృందంతో పాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంను రఘురామ కోరారు.ఈనెల 14న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘరామరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.











