మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో సెంట్రల్ రైల్వే అధికారులు ప్లాట్ ఫార్మ్ టికెట్ రేట్లు భారీగా పెంచారు. ఇంతకీ రైల్వే ఫ్లాట్ ఫార్మ్ టికెట్ రేటు ఎంతో తెలుసా 50 రూపాయలు. ఇంతకుముందు వరకు 10 రూపాయలుగా ఉన్న ఫ్లాట్ ఫార్మ్ టికెట్ ధర మార్చి 1 అర్ధరాత్రి నుండి 50 రూపాయలకు పెంచారు. పెరిగిన ఈ ధరలు వెంటనే అమల్లోకి రావడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈ ఫ్లాట్ ఫార్మ్ ధరలు దేశమంతటా కాకుండా వాణిజ్య రాజధాని అయిన ముంబైలో మాత్రమే సుమా ! మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్ళీ శరవేగంగా పెరుగుతుండటంతో రైల్వే ఉన్నతాధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కారణం ఏంటో తెలుసా ..
ప్రయాణీకులకు సెండాఫ్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఇతరులు రైల్వే స్టేషన్లకు వస్తుండటంతో వాళ్ళని నియంత్రించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ స్పష్టం చేశారు. ఈ ధరలు మార్చి 1 నుండి జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఫ్లాట్ ఫార్మ్ టికెట్ ధరలు భారీగా పెంచడం వల్ల రైల్వే స్టేషన్‌లలో రద్దీ తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.











