టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8వ తేదీన గుంటూరులో చంద్రబాబు పర్యటన సాగనుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా ప్రాంతాల్లో ఆయన రోడ్ షో లు నిర్వహించనున్నారు. పది అంశాలపై ఇప్పటికే టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించటంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలే అజెండాగా తమ అధినేత పర్యటనలు సాగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కూడా..
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు