మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు మల్టీ టాస్క్ మాస్టర్ లా మారారు. ఒక పక్క యన్టీఆర్ తో రెండో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ వెర్షన్ కు మాటలు , స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ఈ రెండూ కాకుండా.. ఆయన ఇప్పుడు పవర్ స్టార్ కోసం మరో ముఖ్యమైన పని చేయడానికి రంగంలోకి దిగుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓన్ బ్యానర్ లో మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా ఒక సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ కథ అందించనుండడం విశేషంగా మారింది. త్రివిక్రమ్ గతంలో పవన్ నటించిన ‘తీన్ మార్’ మూవీకి డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. ఆయన కోసమే .. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ వెర్షన్ కు స్ర్కిప్ట్ వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన మేనల్లుడి కోసం ఓ అదిరిపోయే లవ్ స్టోరీ రాస్తున్నారని సమాచారం. అతి త్వరలో దర్శకుడ్ని కూడా ఫైనల్ చేసి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరి త్రివిక్రమ్ ఉప్పెన హీరో కోసం ఏ రేంజ్ కథ రాస్తారో చూడాలి.
Must Read ;- అప్పుడు కృతిశెట్టి ఇప్పుడు కేతికా శర్మ.. అదిరిందయ్యా వైష్ణవ్











