టీడీపీ ప్రభుత్వ హయంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న లోకేష్ ను సీఐడీ విచారిస్తోంది. అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నలకు లోకేష్ తడపడకుండా సమాధానాలు ఇస్తున్నారు. ఒకేసారి వంద ప్రశ్నలు వేసిన సమాధానాలు ఇస్తానని అధికారులకు లోకేష్ చెప్పడంతో ప్రశ్నలను ఆచితూచి అడుగుతున్నట్లు సమాచారం.
తెలుగు దేశం పార్టీలో .., ప్రభుత్వంలో ఏ ఏ పదువులు చేపట్టారని సీఐడీ ప్రశ్నించగా.. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కార్యకర్తల సంక్షేమం.., ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పనిచేసినట్లు సమాధానమిచ్చినట్లు తెలిసింది. అలానే హెరిటేడ్ ఫుడ్స్ గురించి అడిగిన ప్రశ్నలకు కూడా లోకేష్ సమాధానమిచ్చారు.
అలానే మంత్రి వర్గ ఉప సంఘం గురించి లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఉప సంఘం దృష్టికి ఆ సమయంలో ఏమైనా ఇన్నరింగ్ రోడ్డు ప్రస్తావన ఏమైనా వచ్చాందా అని అడుగగా.. అదేం రాలేదని లోకేష్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
లోకేష్ నివసిస్తున్న నివాసాల గురించి ప్రశ్నించగా.. వాటికి బదులిచ్చారు లోకేష్. హైదరాబాద్ లో సొంత ఇళ్లు ఉందని.., ఉండవల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. ఆ అద్దెను తన తల్లి చెల్లిస్తోందని బదులిచ్చారు. లింగమనేని సంస్ధలకు చెందిన స్థలాన్ని ఏమైనా తీసుకున్నారా..?అని అడిగిన ప్రశ్నకు టీడీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని అనుకుని లింగమనేని సంస్ధకు చెందిన కొంత స్థలాన్ని వాస్తు రీత్య అవసరమై కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చారు లోకేష్. జీవో నెంబర్ 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని సీఐడీ ప్రశ్నించగా.. వారంతా కోర్టుకు వెళ్లగా .. న్యాయస్థానం ఆదేశాల మేరకు పాటించామని సమాధానమిచ్చారు.
ఇన్నర్ రింగు రోడ్డు కోసు విచారణ పేరుతో రెండు రోజులుగా తనను ఆ కేసులో కాకుండా వివిధ అంశాలపై ప్రశ్నించడం ఏమిటని లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసుకు సంబంధంలేని హెరిటేజ్, తెలుగుదేశం పార్టీ, రాజధాని అమరావతి లేవట్ల పై ప్రశ్నలు అడగడం ఏమిటని లోకేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధంలేని వేర్వేరు అంశాలపై అడిగినట్లు లోకేష్ ను సమయాన్ని వృధా చేస్తున్నారని సీఐడీ తీరుపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











