రంగల ప్రపంచం చుట్టూ అలుముకుంటున్న రాజకీయ క్రీనీడ..!
చిత్ర పరిశ్రమను అభివృద్ధి పరిచి.. తద్వారా ఫలాలను ఆశించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానిని విస్మరించింది. సినిమా వాళ్ల వల్ల లాభంలేదని, మీ రెమ్యునరేషన్ తగ్గించుకోండి అంటూ హీరోలపై, సినిమా ప్రమోషన్ పేరుతో నిర్మాతలు దోచుకుంటున్నారు అంటూ వైసీపీ మంతులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఏపీలో టికెట్ ధరను సులభ కాంప్లెక్స్ ధరకు తీసుకొచ్చిన జగన్ రెడ్డి చర్యలను నిర్మాతలు, ఎగ్జిబిటర్స్..ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలు ఖండిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిని పరిశ్రమపై ఫైర్ అయ్యాడు. అప్పుడప్పుడు సొంత పార్టీ నిర్ణయాలపై, ప్రభుత్వ అనాలోచిత చర్యలపై తనదైన శైలిలో ఖండిస్తున్న ఎమ్మెల్యే, సినీ హీరోలపై నోరుపారేసుకున్నాడు. సినిమా వాళ్ల బలిసి కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించడంతో చిత్ర సీమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఖండనలు తెలుపుతున్నారు. ఏపీ అంటే సినిమా వాళ్లకు గుర్తుందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించడంపై మండిపడుతున్నారు.
ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపై వివాస్పద వ్యాఖ్యలు..!
ఎమ్మెల్యే నల్లపురెడ్డి వివాదాలకు కేఆరాఫ్ అని చెప్పవచ్చు..! గతంలో కూడా అనేకమార్లు సొంతపార్టీ నేతలపై, అధికారులపై తనదైన శైలిలో నోరుపారేసుకుని వార్తల్లోకెక్కారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల విధులపై అప్పట్లో నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యాలు వివాదస్పదమయ్యాయి. తాజాగా సిని హీరోలపై విమర్శలను ఎక్కుపెట్టారు. టికెట్ ధర తగ్గిస్తే.. సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముంది అంటూ ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలపై సిని హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిని రంగాన్ని అభివృద్ధి పరిచి.. ప్రభుత్వం ఆ ఫలాను ఆశిస్తే ఒక విధంగా బాగుంటుంది. అటువంటిదేమి లేకుండా మనుగడును ప్రశ్నిస్తే ఎలా? అని గుర్రుమంటున్నారు. టికెట్ ధర తగ్గిస్తే.. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ దిగొచ్చి, ప్రభుత్వంతో మంతనాలకు వస్తారని ఆశించారు. కానీ జగన్ రెడ్డి పప్పులు ఏమి ఉడకలేదు. పోగా.. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలన్నీ వాయిదా వేసుకుని కూర్చుకున్నారు నిర్మాతలు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ పై ఆధారపడి జీవనం సాగించే సిబ్బంది, కూలీలు రోడ్డున పడ్డారు.











