టాలీవుడ్లో అదరగొట్టేంత అభినయాన్ని ప్రదర్శించలేకపోయినా.. ఆకర్షించేంత అందంతో అదరహో అనిపించింది అందాల రకుల్ ప్రీత్ సింగ్. చిన్న హీరోల సరసన కథానాయికగా కెరీర్ బిగిన్ చేసింది. ఆపై మినిమమ్ రేంజ్ హీరోలతో ఆడిపాడింది. ఫైనల్ గా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేంత స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ.. పెద్ద హీరోలతో రకుల్ చేసిన సినిమాలు వరుసగా పరాజయం అవడం మొదలు పెట్టాయి. అందుకే బాలీవుడ్ పై మెయిన్ ఫోకస్ పెట్టింది. అక్కడ కొంత వరకూ సక్సెస్ అందుకుంది. అలాగే కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి.. అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకొనే ప్రయత్నాలు చేసింది.
కానీ ఈ రెండు భాషల్లోనూ తెలుగులో వచ్చినంత పాప్యులారిటీ దక్కించుకోలేకపోయింది రకుల్. అలా అమ్మడు మంచి ఫామ్ లో ఉండగానే.. తెలుగులో క్రేజ్ కోల్పోయింది. అంతలోనే పులి మీద పుట్రలా లాక్ డౌన్ వచ్చిపడింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ కానీ ఉండి ఉంటే.. ఆమె ఏదిశగా కదిలేదో తెలియదు కానీ.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం లాక్ డౌన్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
ఈ లాక్ డౌన్ టైమ్ లో మిగిలిన హీరోయిన్స్ సెట్స్ రాలేమని నిర్మాతలకు కరాఖండీ గా చెప్పేశారు. కానీ రకుల్ మాత్రం తెలివిగా హైద్రాబాద్ కు తన మకాం షిఫ్ట్ చేసేసింది. నిర్మాతలందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పొగొట్టుకొన్న చోటే వెతుక్కోవాలి అనే సామెతను నిజంగా చేస్తూ.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంది.
స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోకపోయినా.. కనీసం మినిమమ్ రేంజ్ హీరోల సినిమాల్లో అయినా .. ఆఫర్స్ దక్కించుకోవడం విశేషం. సాయితేజ తమ్ముడు వైష్ణవ్ తేజ రెండో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. క్రిష్ దర్శకత్వంలో ఇటీవల లాంఛ్ అయిన ఈ సినిమా లో సీనియర్ అయినప్పటికీ రకుల్ నే కథానాయికగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. అలాగే.. మరో యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం చెక్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేశాని తెలుస్తోంది. ఇంకా నాగచైతన్య కొత్త సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నే కథానాయికగా ఎంపిక చేశారట. అలాగే విక్రమ్ కుమార్ కొత్త సినిమాలో సైతం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోందని వినికిడి.
ఇంకా మరికొన్ని చిన్న చిత్రాలకు కథానాయిక గా రకుల్ పేరును పరిశీలిస్తున్నారట. అలా మొత్తానికి లోకల్ గా వచ్చి ఉంటూ.. పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ .. పారితోషికం విషయంలో కూడా ఒక మెట్టు దిగి.. కాస్తంత రీజనబుల్ గా కోట్ చేస్తోందట. సో.. లాక్ డౌన్ కు ముందు .. తన కెరీర్ ను ఎలా లీడ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు .. అనుకోని వరంగా లాక్ డౌన్ వచ్చి.. ఆమెను తిరిగి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ను చేసేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ .. ఇంకెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.