ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా బిగ్గెస్ హిట్ గా నిలిచింది. ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఎన్టీఆర్ ను రాయలసీమ నేపద్యంలో సరికొత్తగా చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందని టాలీవుడ్ సమాచారం.
ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారట. ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాక్. ఎక్కువ యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమా అని, ఎన్టీఆర్ నట విశ్వరూపం మరోసారి ఈ సినిమాలో కనపడుతుందంట. అయితే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పడుతుందని సమాచారం.
ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా పూర్తి కావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. ఈలోపల మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’, త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను పూర్తి చేసి, వెంటనే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాను మొదలు పెడతారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవ్వకముందే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాలి.











