Ram Charan Buys Mercedes Maybach GLS600 Worth Rupees 4 Crores :
మెగా పవర్ స్టార్ కు గుర్రాల మీద ఎంత మోజు ఉంటుందో కార్ల మీద కూడా అంతే మోజు ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా కార్ల మీద విపరీతమైన మోజు ఉంటుంది. ఖరీదైన కార్లను తారలు కొనుగోలు చేసినప్పుడల్లా వార్తలు వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ కారు లాంబొర్గీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ కూడా మెర్సిడెజ్ మేబాచ్ జీఎల్ ఎస్ 600 మోడల్ కారును కొన్నారట.
తనకు కావలసిన రీతిలో దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. దాదాపు రూ. 4 కోట్లు ఈ కారు కోసం ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి కారులు బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, కృతిసనన్ దగ్గర కూడా ఉన్నాయట. మామూలుగా అయితే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 2.43 కోట్లు. ఈ కార్లు ఈ ఏడాదికి 50 మాత్రమే ఇండియా మార్కెట్ కి కేటాయించారు. వచ్చే ఏడాదికి ప్రస్తుతం బుకింగ్స్ జరుగుతున్నాయి.
రామ్ చరణ్ కొన్న కారు అత్యంత అధునాతన సదుపాయాలతో ఉంటుంది. అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ప్రతి సీటులోనూ వెంటిలేటర్ తో పాటు మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయట. వెనక రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది. మొత్తం 8 ఎయిర్ బ్యాగ్ లు, టైర్ ప్రెజర్ మానిటర్ కూడా ఉన్నాయట. 4.9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగానికి అందుకుంటుందట. 250 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణిస్తుంది. నెట్టింట్లో రామ్ చరణ్ కొన్న కొత్త కారు వార్త వైరల్ అవుతోంది.











