ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. మొక్కలు నాటిన చరణ్ ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ టీమ్ కు ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి అండ్ టీమ్ .. మొక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని వీడియో తీసి.. దాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన జక్కన్న.. మరికొందరు దర్శకులకు ఛాలెంజ్ విసిరారు. ఆ లిస్ట్ లో రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు.
అయితే రాజమౌళి ఛాలెంజ్ విసిరిన గంటలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తాను ఇలాంటి ఛాలెంజుల్ని స్వీకరించలేనని, నిర్మొహమాటంగా చెప్పేశారు. తాను ఏ చాలెంజ్ లో భాగంగానైనా మట్టిని ముట్టుకోడానికి ఇష్టపడనని, తనకి మట్టంటే అసహ్యమని చెప్పారు. మొక్కలు కేవలం మంచి వ్యక్తులు మాత్రమే ముట్టుకోడానికి అర్హమైనవిగా నేను భావిస్తాను. నాలాంటి స్వార్ధపరులకు ఆ మొక్కలు సూట్ కావు అని రాజమౌళి ఛాలెంజ్ పై స్పందించారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sir @ssrajamouli I am neither into green nor into challenges and I hate touching mud ..The plants deserve a much better person and not a selfish B like me ..Wish u and ur plants all the best 🙏 https://t.co/xusQ1a1ftR
— Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2020