యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ ఇండియన్ సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ ప్రభాస్ అభిమానులతో పాటుగా సినీ లవర్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒక కీలక షెడ్యూల్ ను ఇటలీలో పూర్తి చేసుకొని మొన్నీమధ్యనే హైదరాబాద్ చేరుకుంది చిత్ర బృందం. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.
త్వరలోనే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్ టాక్. ఈ క్లైమాక్స్ సన్నివేశాల కోసం దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో ఒక భారీ సెట్ ను వేస్తున్నట్లు సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ సెట్ లోనే చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. ఈ సినిమా క్లైమాక్స్ ను హాలీవుడ్ కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్ నిక్ పోవెల్ పర్యవేక్షణలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ సినిమాపై ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో అసలు పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన గత చిత్రం ‘సాహో’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ప్రభాస్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా ‘సాహో’ సినిమా బాగా నిరుత్సాహపరిచింది. ‘రాధేశ్యామ్’ సినిమా ద్వారా ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ భారీ సెట్ రాధేశ్వామ్ మూవీకి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.