దేశవ్యాప్తంగా రేపటి రోజు కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణమేంటో అందరికీ తెలుసు. రేపే రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ బర్త్ డే నాడు.. అతడికి యన్టీఆర్ కానుకగా ఇచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియో ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే. నిజానికి యన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న రావాల్సిన మరో వీడియో లాక్ డౌన్ కారణంగా ఆ టైమ్ లో కుదరలేదు.
అందుకే దసరాకానుకగా.. అభిమానులకోసం రాజమౌళి ఈ వీడియోను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రోజు రామ్ చరణ్ .. రేపు రాబోయే వీడియో ను ఉద్దేశిస్తూ.. తారక్ ను టీజ్ చేస్తూ.. ఒక చిన్న వీడియో ను పోస్ట్ చేశాడు. నీళ్ళలోంచి ఒకరి చెయ్యి పెద్ద బళ్ళాన్ని తీస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో .. టుమారో అనే టెక్స్ట్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ చిన్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు భీమ్ ఏ రేంజ్ లో అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.
Brother, here’s something to tease you…. @tarak9999 😉
But unlike you, I’ll make sure to be on time 🤗 #RamarajuForBheemTomorrow #RRRMovie @ssrajamouli pic.twitter.com/G1DkvmBxVB
— Ram Charan (@AlwaysRamCharan) October 21, 2020











