వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. వికారాబాద్ జిల్లా, దారూర్ మండలం, మొమిన్ కాలాన్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మొమిన్ కాలాన్ గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాలికపై ఈరోజు మధ్యాహ్నం రాములు (45) అత్యాచారానికి పాల్పడ్డాని తెలిసింది.
వికారాబాద్ జిల్లా, దోమ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములు (45) మొమిన్ కాలాన్ గ్రామానికి బ్రతకడానికి వలస వచ్చాడని సమాచారం. ఎనిమిదేళ్ల బాలిక ఒంటరిగా కనిపించడంతో ఈ అఘాయిత్యం చేశాడు.
లైగిక దాడికి గురైన బాలికను వికారాబాద్ సఖీ సెంటర్ నుండి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.











