మన దేశంలో సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉందో.. క్రికెట్ అంటే కూడా అంతకంటే ఎక్కువ పిచ్చే ఉంది. సినిమాలో నటించేవారు రీల్ హీరోలు అయితే.. క్రికెటర్స్ రియల్ హీరోలు అని అంటుంటారు. కొంత మంది క్రికెటర్లు హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తుంటారు. అప్పట్లో భారత క్రికెట్ కెప్టెన్ అయిన మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ షర్మిలా టాగూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య క్రికెటర్ కోహ్లి, హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్నారు. అయితే.. చాలా మంది క్రికెటర్లు హీరోయిన్ లతో డేటింగ్ చేసినప్పటికీ కొందరు పెళ్లి పీటల వరకు వచ్చారు. మరి కొందరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అలా బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన జంట గంగూలీ, నగ్మా. ఇంతకీ.. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌరవ్ గంగూలీ, నగ్మా ప్రేమ వ్యవహారం అప్పట్లో ఓ సంచలనం. కారణం ఏంటంటే.. గంగూలీ డోనాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ నగ్మా ప్రేమలో పడడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. నగ్మా విషయానికి వస్తే.. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్టార్ హీరోలందరి సరసనా నటించి మెప్పించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా బాగా పాపులరైంది. తమిళ, మలయాళం, కన్నడ, భోజ్ పురి, బెంగాలీ, పంజాబీ, మరాఠీ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది.
సినిమాలతో బిజీగా ఉండే నగ్మా, గంగూలీకి ఎలా కలిసిందో కానీ.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ లు చేస్తూ.. పార్టీలకు, పబ్ లకు వెళ్లేవారు. అప్పటివరకు సీక్రెట్ గా ఉన్న వీళ్ల వ్యవహారం 1999 వరల్డ్ కప్ టైమ్ లో ఒక్కసారిగా బట్టబయలైంది. లండన్ లో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్ కు జంటగా వెళ్లి ఫోటోలు దిగడంతో రూమర్స్ కి మరింతగా ఆజ్యం పోసినట్టు అయ్యింది. గంగూలీ కెప్టెన్ అయినప్పుడు నగ్మా, గంగూలీ జంటగా శ్రీకాళహాస్తి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. అక్కడ మీడియాకు చిక్కడంతో వీళ్ల రిలేషన్ హాట్ టాపిక్ అయ్యింది. అలాగే వివాదాస్పదం కూడా అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. విడిపోయారు.
Must Read ;- ఆల్జీబ్రాలో కాదు ఇది అరియానా, ఆర్జీవీల ఎక్స్











