అ,ఆ.. ఇదేదో సినిమా పేరు అనుకునేరు. అ అంటే అరియానా, ఆ అంటే ఆర్జీవీ. వీరిద్దరూ కలిసి బూతులు మాట్లాడుకుంటే రసహృదయులకు వినసొంపుగానే ఉంటుంది. సంప్రదాయ వాదులకు వీరిద్దరినీ చెప్పుతీసి కొట్టాలనిపిస్తుంది.
ఆర్జీవీతో అరియానా బోల్డ్ టాక్స్ యూట్యూబ్ ను ఓ ఊపు ఊపేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ ను ఈ ఇంటర్వ్యూ సాధించిందంటే జనం ఇలాంటి వీడియోల కోసం ఎంతగా మొహం వాచారో అర్థమవుతుంది. ఇక వీరి ఇంటర్వ్యూలోకి మరోసారి వచ్చేద్దాం. యువతనే కాదు పెద్ద వాళ్లను సైతం పక్కదారి పట్టించేలా ఇంటర్వ్యూ సాగింది. పైగా ఇందులో కొత్త వివాదాలకు తెరతీశారు. ఆల్జీబ్రాలో ఎక్స్ లేకపోతే లెక్క ఎలా తేలదో ఆర్జీవీ జీవితంలో కూడా సెక్స్ లేకపోతే ఆ లెక్క తేలనట్టే ఉంది. తను ఎంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాడు ఆ లెక్కను కూడా ఆయనే చెప్పేసరికి అందరూ నోరెళ్లబెట్టారు.
ప్రేమ గురించి అతను చెప్పే నిర్వచనం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఎఫైర్ అనేది ఇదివరకు సంవత్సరాల్లో ఉండేది ఇప్పుడు గంటలోకి వచ్చిందన్నారు. ఎందుకంటే గంట అనేది సెక్స్ కు చాలా ముఖ్యమట. సంవత్సరాల తరబడి సాగే ప్రేమ ఆ తర్వాత నెలల్లోకి, తర్వాత రోజుల్లోకి మారి.. ఇప్పుడు గంటకే పరిమితమైందంటూ వివరణ ఇచ్చారు. అంటే సెక్స్ లో పాల్గొన్నంత సేపే ప్రేమ ఉండాలట. ప్రేమ పేరుతో మిగతా సమయాన్ని వృధా చేయకూడదంటున్నారాయన. ఇదేం ఫిలాసఫీనోగానీ అరియానా మాత్రం ఆయన మాటలను అమాయకంగా ఆస్వాదించింది.
Also Read ;- హాట్ బ్యూటీ తొడల్ని ముద్దు పెట్టుకున్న వర్మ
ఆర్జీవీ ‘అమ్మా’యకుడు అనే మాటలను ఆయన మరోసారి ఒప్పుకున్నట్టు ఈ ఇంటర్వ్యూ నిరూపించింది. ‘ఈ ఇంటర్వ్యూకు ముందు మీరు ఆఖరు సారి సెక్స్ లో ఎప్పుడు పాల్గొన్నారు?’ అని అరియానా అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ చెప్పిన సమాధానం విని ఆమె కూడా అవాక్కయింది. పైగా నీ మీద ఒట్టు తను అబద్దం చెప్పడం లేదంటున్నాడు. ఆమెతో కూడా సెక్స్ చేయాలని ఉందనేశాడు. ఆమె అక్కడికి రావడానికి గంట ముందే ఆ కార్యక్రమాన్ని పూర్తిచేశానంటూ షాక్ కు గురిచేశారు.
సెక్స్ తర్వాత ఎఫైర్ పొడిగిస్తే ఎమోషన్ కు దారితీస్తుందట. ఎమోషన్ వచ్చినప్పుడు రిలేషన్ షిప్ పెరుగుతుందనీ, దాంతో పాటు తలనొప్పులు కూడా పెరిగిపోతాయి అనేది ఆయన ఫిలాసఫీ. అమ్మాయికి ఆ తలనొప్పులు కలిగించడం ఇష్టం లేక త్యాగం చేసి కేవలం ఆమెతో సెక్స్ చేస్తున్నంత టైమ్ మాత్రమే ఆమెతో ప్రేమలో తను ఉంటాడట. తనకు ఓ గంట పారేస్తే వాళ్ల టైమ్ కూడా వేస్ట్ అవదట. అది వారికి తను ఇచ్చే గిఫ్ట్ అని కూడా అంటున్నాడాయన. ఈ ఇంటర్వ్యూ చూసిన వారిని వీరిద్దరినీ కామ పిశాచి ఆవహించిందా అన్న భావన రాకుండా పోదు.
వివాదాలకు ఆజ్యం
అరియానా అందాన్ని పొగుడుతూనే మిగతావారిని తెగడడం ఆర్జీవీ చేసిన మరో తప్పిదంలా అనిపిస్తుంది. ‘మనిద్దరమే ఉన్నప్పుడు నిన్నొక్కదాన్నీ చూస్తాను కానీ.. నిన్ను చూడటానికి బిగ్ బాస్ చూసి.. ఆ మిగిలిన 15 వెధవ ముఖాలను చూడాల్సిన అవసరం నాకేంటి’ అంటూ ఆర్జీవీ చెప్పిన సమాధానం పెద్ద విమర్శలకు దారితీసే అవకాశం ఉంది. అరియానాను పొగడం కోసం మిగతావారిని ఆర్జీవీ వెధవల్ని చేయాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ కారణంగా తను పైకొచ్చానన్న కృతజ్ఞతా భావం అరియానాలో ఉండవచ్చు. అది వారిద్దరి పర్సనల్ వ్యవహారం. దీని కోసం 15 మందిని వెధవల్ని చేయాల్సిన అవసరం లేదు. దీని మీద వచ్చే ట్రోల్స్ కు ఆర్జీవీ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
రామూయిజంలో నిజమెంత?
ఈ ఇంటర్వ్యూలో రామూయిజం చూస్తే ఇదే నిజమా అనిపించక మానదు. కన్విన్స్ చేయడంలో ఆర్జీవీ దిట్ట. ఏమో రాము చెప్పే మాటల్లో నిజముందేమో అని కూడా అనిపిస్తుంది. అలాంటి ట్రాప్ లో అరియానా కూడా పడి ఉండవచ్చు. ‘అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికే మీరు వర్కవుట్లు చేస్తారా?’ అంటూ అరియానా అమాయకంగా ప్రశ్నించడం.. ‘నో.. నాకున్న టాలెంట్ ఏంటంటే మాటలతో గారడీ చేయడం.
నేను వర్కవుట్లు చేసేది వీలైనంతవరకు ట్రిమ్ గా ఉండాలనే. నేను మాటలతో ఎందుకు ఇంప్రెస్ చేస్తానంటే ఎవరైతే నా మాటలు వింటారో వారు వెధవలు కాబట్టి. వారికి నా అంత బుర్రలేదు కాబట్టి వారిని పడేయగలుగుతున్నాను’ అనేది ఆర్జీవీ సమాధానం. ఇది కూడా వివాదాస్పద వ్యాఖ్యే. అంటే ఈ ఇంటర్వ్యూ చూసేవారంతా వెధవలు అనే అనుకోవాలా? దీనికి కూడా వర్మ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఆడది ఒకే మగాడితో ఉండటం తప్పేనట
ఆడది ఒకే మగాడితో ఉండటం తప్పట.. దానికి కారణం ఏమిటంటే.. ఒకే మగాడితో ఉంటే వేరే మగాడు వాడికన్నా బెటరా కాదా అనేది తెలుసుకోడానికి ఆస్కారం ఉండదట. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అనే ఇంత పెద్ద సీక్రెట్ ను రామ్ గోపాల్ వర్మ చెప్పాడంటే ఎవరూ నమ్మరు కాబట్టి సోక్రటీస్ చెప్పినట్టు ఆయన మీదకు తోసేశారన్న అనుమానం నెటిజన్లకు వస్తోంది. అందరూ ఆమె వెనకాల పడేటట్లు చేసుకోవాలట. ‘ఆ తర్వాత నీకు నచ్చిన వాడిని నువ్వు సెలక్ట్ చేసుకో’ అంటూ అరియానాకు కూడా ఓ ఉచిత సలహా ఇచ్చేశాడు.
లవ్ అంటే సెక్సేనట. సెక్స్ లేకపోతే లవ్ అనేది లేదనేది ఆయన థియరీ. ఫైనల్ గా రాము మంచి బాలుడు అని చెబితే తన రిపుటేషన్ చెడగొట్టేసినట్టేనని కూడా ఈయనగారు అంటున్నారు. నీ బాడీలో నీ బోయ్ ఫ్రెండ్ కు ఇష్టమైన పార్ట్ ఏమిటి? అని వర్మ అడగడం, ఆమె ‘నడుము’ అని సమాధానం చెప్పడం వరకూ ఫరవాలేదుగానీ ఆమె బాడీలో తనకు ఏమి ఇష్టమని నువ్వు అనుకుంటున్నావ్ అని అడగడం మాత్రం టూమచ్ అనిపిస్తుంది.
‘తొడలు అని ఇంతకుముందే అన్నారు కదా’ అంటే అది అప్పుడట.. ఇప్పుడు వేరే ఉందని ఆ పార్ట్ ఏదో చెప్పేశాడు. అరియానా ‘యాస్’ అంటే ఆర్జీవీకి ఇష్టమట. ఈ ఇంటర్వ్యూ చూసిన వారు మాత్రం ‘యాక్.. థూ’ అంటూ వర్మ మీద ఉమ్మేసేలా సాగింది. మరి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ లోబడే ఇంటర్వ్యూ సాగించే తెలివితేటలు వర్మకు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇన్ని ఇంకెన్ని మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతుందో చూడాలి. అరియానా, ఆర్జీవీల ఎక్స్ మాత్రం జనం గుండెల్లో గాభరా పుట్టిస్తోంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- బోల్డ్ కాదు అరియానాతో ఆర్జీవీ బోలెడు టాక్స్!