Record Collection Of Love Story And Most Eligible Bachelor
సక్సెస్ ఉంటేనే సినిమా రంగం కళకళలాడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమా రంగానికి సక్సెస్ అనే వెలుగులు కేవలం నాలుగు సినిమాల వల్లే వచ్చాయి. మరి కొన్ని సినిమాలు ఉన్నా వసూళ్ల పరంగా ఆ రికార్డు ఈ నాలుగు సినిమాలకే దక్కింది. కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ. ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటోంది.
అయితే.. టాలీవుడ్ కు కాసులు కురిపించేలా మరో నైజాం అంటే ఓవర్ సీస్ మార్కెట్ అని చెప్పవచ్చు. అక్కడ కూడా థియేటర్లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రాలేని పరిస్థితి. అయితే.. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో ఓవర్ సీస్ లో జాతిరత్నాలు సినిమా మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని అందించింది. ఈ సినిమాలో పెద్ద స్టార్ లు ఎవరూ లేకపోయినా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన పెద్ద సినిమా లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ విభిన్న ప్రేమకథా చిత్రంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా కూడా ఓవర్సీస్ లో మిలియన్ కు పైగా డాలర్లు వసూలు చేసింది. జాతిరత్నాలు తర్వాత 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమా అంటే నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీనే.
Record Collection Of Love Story And Most Eligible Bachelor
ఇదిలా ఉంటే.. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ చిత్రంలో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాయింట్ తో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా ఓవర్ సీస్ లో దూసుకెళుతుంది. ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. త్వరలోనే వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుందని అంటున్నారు సినీ పండితులు. అన్నయ్య నాగచైతన్య తర్వాత తమ్ముడు అఖిల్.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం.











